Header Banner

సుదర్శన చక్రం! పాక్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టిన భారత ఆర్మీ!

  Thu May 08, 2025 16:17        India

పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి పాకిస్తాన్‌పై ప్రతీకారానికి దిగింది భారత్. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను పెంచిపోషిస్తోన్న పాకిస్తాన్‌పై బుధవారం తెల్లవారు జామున మిస్సైళ్లతో దాడి చేసింది.


ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ దాడితో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాలపై వేళ్లూనుకుపోయిన ఉగ్రవాద సంస్థలను నామరూపాల్లేకుండా చేసింది భారత్. జైషె మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు భారీగా నష్టపోయాయి. అవి నిర్వహిస్తోన్న శిబిరాలను 25 నిమిషాల్లోనే ధ్వంసం చేసి పడేసింది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 



ఈ దాడుల్లో వంద మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చనీ తెలిపారు. అదే సమయంలో పాకిస్తాన్ రెచ్చగొడితే తప్ప తదుపరి సైనిక చర్యలు ఉండవనీ అన్నారు. అటు ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదులకు భారీగా నష్టం కలిగించినట్టయింది. ఈ నష్టానికి అక్కడితో బ్రేకులు పడలేదు. పాకిస్తాన్ ఆర్మీ కూడా తీవ్రంగా నష్టపోయింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ ప్రయోగ కేంద్రం హెచ్ క్యూ 9 భారీగా దెబ్బతిన్నది. చైనా అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో పాకిస్తాన్ ఈ ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్లను అభివృద్ధి చేసుకుంది పాకిస్తాన్. లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ఇవి. భూ ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉండేది ఇక్కడే.


శతృ విమానాలు, డ్రోన్లు, మిస్సైళ్లను గుర్తించడం, వాటిని ట్రాక్ చేయడం, ఇంటర్‌సెప్ట్ కావడానికి హెచ్ క్యూ 9 మిస్సైల్ టెక్నాలజీని రూపొందించుకుంది. రాకెట్ లాంచర్లు, రాడార్, కమాండ్ సెంటర్ల వంటివి దెబ్బతింటే- దాని నష్టం అపారంగా ఉంటుంది. ఈ మిషన్‌లో డీప్ స్ట్రైక్ క్షిపణులను ఉపయోగించింది భారత్.


ఈ దాడితో ఎయిర్ డిఫెన్స్ విభాగంలో పాకిస్తాన్ సామర్థ్యం భారీగా క్షీణించినట్టయింది. దీనిపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. ప్రాణనష్టం సంభవించినట్లు ప్రకటించుకుందే తప్ప ఆర్మీకి సంబంధించినంత వరకు జరిగిన నష్టంపై ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు.


ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SudharshanChakra #IndianArmyStrike #IndiaStrikesBack #PakistanTensions #SurgicalStrike #OperationSindhoor